బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి..
‘గతంలో ఎన్నడూలేని విధంగా విజయవాడకు వరద ముంపు ఎదురైంది. సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మానవతా కోణంలో సహాయసహకారాలు అందించాల్సిన అవసరముంది. బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా న్యాయమైన సెటిల్‌మెంట్స్ జరిగేలా చూడాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబద్ధతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలందించాలి. వాహనాలు, గృహాలు, వ్యాపార వాణిజ్య ఆస్తుల నష్టాలకు సంబంధించి జరిగిన నష్టాలపై వచ్చిన ప్రతి క్లెయిమ్‌నూ సరైన విధంగా అసెస్ చేసి ఆ మేరకు పూర్తిస్థాయిలో సెటిల్‌మెంట్ చేయాలి. మొత్తంమీద పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.