posted on Sep 14, 2024 10:39AM
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా భయంతో ఇక కబ్జాలుండవని న్యాయస్థానం వాఖ్యానించింది. చెరువులు, నాలాలను ఆక్రమించిన వాళ్లు కొందరు హైకోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీవో 99 ప్రకారం అక్రమ కట్టాలను హైడ్రా కూల్చి వేసింది. . రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతలకు తాము అడ్డంకి కాదని కానీ చట్టబద్దంగా జరగాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని భార్య కూడా అమీన్ పూర్ చెరువు బఫర్ జోన్ లో కూల్చిన ప్రహారి గోడను పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్లలో నివాసముంటున్న వారికి నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.పేద ప్రజల ఇళ్ల కూల్చివేతలను తాము వ్యతిరేకిస్తున్నామని బిజెపి ప్రకటిస్తే, బడా కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చేయాలని బిఆర్ఎస్ అంటోంది. జిహెచ్ ఎంసీ , నెక్లెస్ రోడ్డులోని కట్టడాలను కూల్చి ఫాతిమా కాలేజిని కూల్చేయాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆదివారం నాడు మరికొన్ని కూల్చివేతలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.