Monday, October 21, 2024

స్టేజ్ జీరో రొమ్ము క్యాన్సర్ గురించి విన్నారా? ఇది ప్రమాదకరమా?-what is stage zero breast cancer know its symptoms and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్

  1. ఇది వరకే కుటుంబంలో, దగ్గరి బందువుల్లో గానీ ఎవరికైనా యుక్త వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే.. వాళ్లకి ప్రమాదం ఎక్కువ.
  2. చిన్నప్పుడు కానీ ఇది వరకే చాతీకి రేడియేషన్ థెరపీ చేయించుకున్న వాళ్లలో
  3. మోనోపాజ్ దశలోకి తొందరగా అడుగుపెట్టిన వాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ
  4. ముప్ఫై ఏళ్ల తర్వాత మొదటి సంతానం కన్నవాళ్లలో
  5. మోనోపాజ్ దశలో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న వాళ్లలో
  6. అధిక బరువు, ఆల్కహాల్, చురుగ్గా లేని జీవనశైలి ప్రమాదం పెంచుతాయి

చికిత్స:

ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి తగ్గిపోతుందనే నిర్లక్ష్యం అస్సలు మంచిది కాదు. గుర్తించిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఈ చికిత్సలో ముందుగా క్యాన్సర్ మరింత ముదిరిపోకుండా చేస్తారు. అలాగే కణాలను వృద్ధి చెందకుండా చికిత్స ఉంటుంది. సర్జరీ, లంపెక్టమీ.. అంటే అసాధారణంగా పెరిగిన కణజాలాన్ని, దాని చుట్టూ ఉన్న కొద్ది మాత్రం ఆరోగ్యకరమైన కణజాలాన్ని వ్యాధి వ్యాప్తి కాకుండా తొలిగిస్తారు. లేదంటే మాస్టెక్టమీ.. రొమ్ములను తొలగించడం లాంటి చికిత్సలుంటాయి. ఇవన్నీ వ్యక్తిని, వ్యాధిని, దాని తీవ్రతను బట్టి మారతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana