శరవేగంగా ఏర్పాట్లు
ఇక ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే శోభయాత్ర మార్గంలో చెట్ల కొమ్మలను తొలగించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషర్ ఆమ్రపాలి తెలిపారు. విగ్రహాలు వచ్చే మార్గంలో చెట్ల కొమ్మల తొలగింపు, రహదారి మరమ్మతులు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు అమర్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. గణేష్ నిమజ్జన ప్రక్రియకు 140 స్టాటిక్ క్రేన్‌లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 160 గణేష్ యాక్షన్ టీమ్ లు ఏర్పాటు చేశామని ఆమ్రపాలి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ మరుగుదొడ్లు కూడా సిద్ధం చేశామన్నారు.