టూర్ షెడ్యూల్ వివరాలు:
- డే 1 – సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. బేగంపేట్, బషీర్ బాగ్, యాత్రినివాస్, కూకట్ పల్లిలో పికప్ పాయింట్లు ఉంటాయి. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు – 9848540374, 9848126947,9848540371)
- డే 2 – ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంటారు. హోంటల్ లో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ ఉంటుంది.
- డే 3 – ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలనుకునేవారు ఏడు రోజుల ముందే ప్రాసెస్ చేసుకోవాలి. టికెట్ల రద్దుకు అవకాశం ఉండదని టూరిజం శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారని హెచ్చరించింది. డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవని తెలిపింది.