Tuesday, November 26, 2024

బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా!-today telangana news latest updates september 14 2024 ,తెలంగాణ న్యూస్

Hyderabad Crime : బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా!

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 14 Sep 202405:10 PM IST

Telangana News Live: Hyderabad Crime : బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా!
  • Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత బావమరిదిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ బావ. అత్తమామలు, భార్యను నమ్మించి బావమరిది మృతదేహానికి అంత్యక్రియలు సైతం పూర్తి చేయించాడు. అయితే మామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడి కిరాతకం బయటపడింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202404:18 PM IST

Telangana News Live: Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం
  • Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి శరవేగంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని ఇతర చెరువులతో పాటు తాత్కాలిక కుంటలను సిద్దం చేస్తున్నారు. మొత్తం ఆరు జోన్లలో 5 పెద్ద చెరువులతోపాటు 73 కుంటలను సిద్ధం చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:15 PM IST

Telangana News Live: Dy CM Bhatti Vikramarka : రూ.2 లక్షలకు పైగా రుణాలు మాఫీపై ఆలోచన, డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
  • Dy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీపై ఆలోచన చేస్తున్నామన్నారు. రెండు లక్షల రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:36 PM IST

Telangana News Live: Medak Tragedy : మెదక్ జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
  • Medak Tragedy : మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. తోబుట్టువులతో భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ రైతు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో సుతార్ పల్లి గ్రామంలో జరిగింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:28 AM IST

Telangana News Live: Online Puja : ఆన్‌లైన్ పూజలు.. విదేశాల్లో ఉన్న తెలుగు వారి మనసులు గెలుచుకుంటున్న హైటెక్ పూజారి!
  • Online Puja : సాంకేతిక పరిజ్ఞానం.. అసాధ్యన్నీ సుసాధ్యం చేస్తుంది. ఎక్కడో ఉన్న వారితో ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడినట్టే.. ఎక్కడో ఉన్న దేవతలకు ఇక్కడి నుండి పూజలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పూజలు చేస్తూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారి మన్ననలు పొందుతున్నాడు మెదక్ జిల్లాకు చెందిన హైటెక్ పూజారి.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202410:40 AM IST

Telangana News Live: Adilabad Flood Loss : రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు
  • Adilabad Flood Loss : ఇటీవల భారీ వర్షాలు, వరదలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణహిత, పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో పత్తి, సోయా, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో 9500 ఎకరాల్లో పం టనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202410:15 AM IST

Telangana News Live: Online Trading Fraud : బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు
  • Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపి ఓ బ్యాంకు మేనేజర్ ను రూ.80 లక్షలు చీటింగ్ చేశాడు సైబర్ నేరగాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సైబర్ నేరగాడు… ఓ లింక్ ద్వారా బ్యాంకు మేనేజర్ కు టోకరా వేశాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:13 AM IST

Telangana News Live: Hyderabad Wines Close : లిక్కర్ కిక్కుకు బ్రేక్.. 17, 18 తేదీల్లో వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ పోలీసుల ఆదేశాలు
  • Hyderabad Wines Close : హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండ్రోజులు కిక్కుకు బ్రేక్ పడనుంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202408:41 AM IST

Telangana News Live: Suryapet Crime : ట్రాక్టర్ దొంగలు వస్తున్నారు.. రైతులారా తస్మాత్ జాగ్రత్త
  • Suryapet Crime : వారి రోజువారీ కూలీ పనులు చేసుకునే వ్యక్తులు. పాడు బుద్ధితో దొంగతనాలకు దిగారు. అమాయక రైతులనే టార్గెట్ చేసుకున్నారు. ఇళ్లు, పొలం దగ్గర నిలిపిన ట్రాక్టర్లను దొంగిలించారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు. దీంతో వారి భాగోతం అంతా బయటపడింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202407:51 AM IST

Telangana News Live: KTR : ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదు – నగర ప్రజల మీద సీఎం రేవంత్ కక్ష గట్టారు – కేటీఆర్
  • పోలీసుల అండతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం కౌశిక్ రెడ్డిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదన్నారు. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా దాడి చేసేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202407:31 AM IST

Telangana News Live: Hyderabad NIMS : హైదరాబాద్ నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు.. పూర్తి వివరాలు ఇవే..
  • Hyderabad NIMS : తెలంగాణలో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చనిపోతున్నారు. మరికొందరు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202406:28 AM IST

Telangana News Live: Vande Bharat Express : రామగుండంకు వందే భారత్ – 3 గంటల్లోనే హైదరాబాద్ కు చేరుకోవచ్చు…!
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈనెల 16 నుంచి నాగ్ పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు రామగుండంలో ఆగనుంది.  ఈ కొత్త సేవలతో ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202406:28 AM IST

Telangana News Live: TG Teachers Transfers : ఆ టీచర్ల చిరకాల వాంఛ నెరవేరబోతోంది.. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలు
  • TG Teachers Transfers : వారి నియామకం జరిగి దాదాపు పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆ టీచర్లు బదిలీలకు నోచుకోలేదు. అందరి లాగే తమకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202405:48 AM IST

Telangana News Live: Hyderabad : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
  • Hyderabad : పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. తాజాగా.. అరెకపూడి గాంధీపై హత్యయత్నం కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202405:01 AM IST

Telangana News Live: TG Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 106 ఖాళీలు – భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!
  • ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మహబూబాబాద్‌లోని మెడికల్ కాలేజీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 106 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి అవుతుంది. ఇంటర్వూల ఆధారంగా తుది జాబితాను ప్రకటించనున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202404:06 AM IST

Telangana News Live: Palm oil crop : మెదక్ నేలలు పామాయిల్ సాగుకు అనుకూలమైనవి: శాస్త్రవేత్తలు
  • Palm oil crop : మెదక్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయించాని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1176 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు వివరించారు. మెదక్ నేలలు పామాయిల్ సాగుకు అనుకూలం అని సైంటిస్టులు చెబుతున్నారు. అటు రైతులు కూడా పామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202401:51 AM IST

Telangana News Live: TG Govt Holiday : ఈనెల 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం – నవంబరులో వచ్చే సెలవు రద్దు!
  • వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం హాలీ డే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి బదులుగా నవంబర్ 9ని వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202401:38 AM IST

Telangana News Live: Karimnagar Congress : డీసీసీ పీఠం వెలిచాలకేనా…! ఎవరికి అవకాశం రాబోతుంది..?
  • కరీంనగర్ డీసీసీ పీఠంపై కీలక నేతలు కన్నేశారు. ఎలాగైనా దక్కిచుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయమే కీలకం కానున్నది. డీసీసీ పగ్గాలు లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు ధీమాతో ఉన్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202401:14 AM IST

Telangana News Live: TG HC On HYDRA : నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చారు..? హైడ్రాపై హైకోర్టు ప్రశ్నలు
  • హైడ్రా తీరుపై  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రా అధికారాలపై లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:20 AM IST

Telangana News Live: September 17th : ఆపరేషన్ పోలో ఎన్ని రోజులు జరిగింది? హైదరాబాద్ సైన్యం ఏమైంది?
  • September 17th : ఆపరేషన్ పోలో.. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్ స్టేట్. ఎందుకంటే.. దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ స్టేట్ ప్రజలకు మాత్రం రాలేదు. ఇంకా నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు మగ్గిపోయారు. వారికి విముక్తి కల్పించడానికి జరిపిందే ఆపరేషన్ పోలో.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:47 PM IST

Telangana News Live: Hyderabad Traffic : సీఎం రేవంత్ వినూత్న నిర్ణయం – ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు, శిక్షణతో పాటు స్టైఫండ్
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ ను స్ట్రీమ్‌లైన్‌ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డ్స్‌ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని చెప్పారు. సమీక్ష సందర్భంగా యూనిఫామ్ నమూనా చిత్రాలను విడుదల చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana