Home లైఫ్ స్టైల్ మనం సరైన ఆహారం తినడం లేదట, మన ప్లేటులో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలేంటో చెప్పిన ఐసీఎమ్ఆర్-icmr...

మనం సరైన ఆహారం తినడం లేదట, మన ప్లేటులో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలేంటో చెప్పిన ఐసీఎమ్ఆర్-icmr said that we are not eating the right food but the ingredients that should be on our plate ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఎంత తినాలి?

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అభివృద్ధి చేసిన డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024 ప్రకారం, రోజుకు 2000 కిలో కేలరీల ఆహారాన్ని ఒక వ్యక్తి తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం కొన్ని పదార్ధాలు సిఫారుసు చేసింది ఐసీఎమ్ఆర్ . మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యకరమైన ప్లేట్లో సగం పండ్లు, కూరగాయలు ఉండాలి. మిగిలిన సగం తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మాంసాహారం, గుడ్లు, నట్స్, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సమతులాహారం మనం తీసుకుంటున్నట్టు. ఒకే భోజనంలో ఇన్ని రకాలు తినలేకపోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్, రాత్రి డిన్నర్ లలో షేర్ చేసుకుని తినాలి.

Exit mobile version