Home బిజినెస్ Ola Electric: సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్

Ola Electric: సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్

0

షో రూమ్ కు నిప్పు..

తను కొన్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter) ను రిపేర్ చేసి ఇవ్వాలని ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ ను సంప్రదించాడు. కానీ, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో, కోపోద్రిక్తుడైన 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ అనే ఆ కస్టమర్ పెట్రోల్ పోసి షోరూంకు నిప్పు అంటించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ ఆగస్టు 28 న ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. కొన్న రోజు నుంచీ దానితో నిరంతరం సమస్యలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా, స్కూటర్ బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ సిబ్బందికి పదేపదే ఫిర్యాదులు చేశాడు. స్వయంగా పలుమార్లు షోరూమ్ కు వెళ్లాడు. కానీ, వారు సరిగ్గా స్పందించలేదు. దాంతో అతడు అసంతృప్తి చెందాడు.

Exit mobile version