posted on Sep 11, 2024 12:23PM
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ కు ఉన్న డిప్లమేటిక్ పాస్ పోర్టు ఆయన అధికారం కోల్పోగానే ఆటోమేటిక్ గా రద్దైంది. దీంతో ఆయన సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజాప్రతినిథుల కోర్టు మాత్రం జగన్ పాస్ పోర్టు కాల పరిమితిని ఏడాదికి కుదించింది. దీంతో ప్రజాప్రతినిథుల కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు ఐదేళ్ల గడువుతో పాస్ పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.