posted on Sep 11, 2024 6:15PM
ఇలా ఉండగా తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈ నెల 5 సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ చేసింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే బెయిలుపై విడుదలయ్యారు.