Home తెలంగాణ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, సుమారు 1000కి పైగా ఖాళీలు!-tg govt green...

కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, సుమారు 1000కి పైగా ఖాళీలు!-tg govt green signal to fill vacant posts in kgbvs educational department orders deo ,తెలంగాణ న్యూస్

0

తెలంగాణలో మొత్తం 495 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో ఇటీవల బదిలీల నిర్వహించారు. దీంతో సుమారు 450 మంది బదిలీ అయ్యారు. వారందరినీ పాత పాఠశాలల్లో రిలీవ్ చేసి కొత్త స్కూళ్లలో జాయిన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000కి పైగా స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీల పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది జూన్ లోనే వీటిని భర్తీ చేయాల్సి ఉండగా.. పలు కారణాలతో నిలిచిపోయాయి. తాజాగా బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో… మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని డీఈవోలకు ఆదేశాలు అందాయి. గతేడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఆధారంగా మెరిట్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులను తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో, ఎలక్షన్ కోడ్ రాకముందే భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కలెక్టర్ల అనుమతితో కేజీబీవీల్లో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది.

Exit mobile version