Home తెలంగాణ ఆ బోట్ల వెనుక కుట్రకోణం..కన్ఫర్మ్!? | conspiracy behind thouse boats| prakasham| barrage| gates|...

ఆ బోట్ల వెనుక కుట్రకోణం..కన్ఫర్మ్!? | conspiracy behind thouse boats| prakasham| barrage| gates| counter| weights

0

posted on Sep 11, 2024 12:03PM

కృష్ణానదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నసమయంలో నదిలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉన్నదన్న సంగతి దాదాపు కన్ ఫర్మ్ అయిపోయింది. ఈ విషయంలో దోషులను వదిలేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  

బోటు యజమానులు ఇప్పటి వరకూ ఆ బోట్లన క్లెయిమ్ చేసుకోవడానికి రాకపోవడంతో ఆ బోట్లను ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని అడ్డుకునే లక్ష్యంగా వదిలారన్న అనుమానాలు ధృవపడుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా వరద ఉధృతికి సంబంధించిన హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా వాటిని బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో లంగరు వేయడం కూడా కుట్ర కోణాన్ని ఎత్తి చూపుతోంది. పైగా ఒక్కొక్కటీ 20 టన్నుల బరువు ఉన్న మూడు బోట్లను బలమైన ఇనుప గొలుసులతో ఒకదానికి ఒకటి కట్టేసి, అవి కొట్టుకుపోకుండా ఉండటానికి మాత్రం ప్లాస్టిక్ తాడుతో లంగరు వేసిన తీరే  కుట్ర కోణాన్ని ఎత్తి చూపుతోంది. 

కృష్ణనది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు నదిలో 5 మరబోట్లు కొట్టుకురాగా వాటిలో రెండు, గేట్ల గుండా దిగువకు వెళ్ళిపోయాయి. అయితే ఇనుప గొలుసులతో ఒకదానికి ఒకటి కట్టేసి ఇసుకతో నింపేసి ఉన్న మూడు బోట్లు గేట్లని ఢీకొని అక్కడే ప్రవాహానికి అడ్డంగా నిలిచిపోయాయి. అవి ఢీకొనడం వలన బ్యారేజీ రెండు గేట్ల కౌంటర్ వెయిట్స్ దెబ్బ తిన్నాయి. అవి లేకుండా గేట్లు ఆపరేట్ చేయడం సాధ్యపడదు. కనుక అప్పటికప్పుడు కన్నయ్య నాయుడు అధ్వర్యంలో రెండు కౌంటర్ వెయిట్స్ తయారు చేయించి, నది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడే వాటిని అమర్చారు. ఇప్పుడు ప్రవాహానికి అడ్డంగా గేట్ల వద్ద ఉన్న బోట్లను తీయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు బోట్లు కలిపి దాదాపు 60 టన్నలు బరువు ఉంటాయి. వీటిని తొలగించడం కోసం ఒక్కొక్కటీ 50 టన్నుల సామర్ధ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా ఫలతం లేకపోయింది. వంద టన్నుల బరువును లేపగల రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా ఆ బోట్లు ఇంచు కూడా కదలలేదు. ఇసుకతో నింపి ఉండటంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదని క్రేన్ ఆపరేటర్లు చెబుతున్నారు. దీంతో ఇక ఇప్పుడు ఆ బోట్లను కత్తిరించి వాటిని తొలగించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం డైవింగ్ టీమ్ లు రంగంలోకి దిగనున్నాయి. అనుభవజ్ణులైన డైవర్లు నదిలోకి వెళ్లి కట్టర్లతో బోట్లను కత్తిరిస్తారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి ఆ ముక్కలను ప్రవాహం దిగువకు వదిలేయడమా, లేకా క్రేన్ల ద్వారా బయటకు తీయడమా అన్నది నిర్ణయిస్తారు. 

ఇక ఇప్పుడు కుట్ర కోణం వద్దకు వస్తే ఇప్పటికే ఆ బోట్ల యజమానులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆ బోటు యజమానులకు వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు ఉండటంతో దీని వెనుక ఉన్నది వైసీపీయే అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, తలశిల రఘురాం వాట్సాప్ కాల్స్ మెసేజెస్ ద్వారా వైసీపీ అగ్రనేతల ఆదేశాల మేరకే ఉద్దేశపూర్వకంగా  వరద నీటిలో బోట్లను వదిలారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నందునే హోంమంత్రి వంగలపూడి అనిత దేశ ద్రోహం కేసు గురించి ప్రస్తావించారని పరిశీలకులు అంటున్నారు.  

Exit mobile version