ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ.. టెస్టుల్లో రీఎంట్రీకి సూర్యకి చాలా కీలకం. టీ20ల్లో సూర్య మంచి ప్లేయర్ అయినప్పటికీ.. వన్డే, టెస్టుల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. వన్డేల్లో అతనికి పుష్కలంగా అవకాశాలు లభించినప్పటికీ 35 ఇన్నింగ్స్‌ల్లో 25 సగటుతో మాత్రమే పరుగులు చేయగలిగాడు. ఇక రెడ్ బాల్ క్రికెట్ విషయానికొస్తే గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అవకాశం వచ్చినా.. గాయం కారణంగా కేవలం ఒక టెస్టు తర్వాత అతను సిరీస్‌కి దూరమయ్యాడు.