హంసలదీవి. కృష్ణమ్మ ఇక్కడే సముద్రంలోకి కలిసే ప్రాంతం. బంగాళాఖాతంలో కలిసే కృష్ణమ్మ రెండు పాయలు హంసలదీవివద్ద కలుస్తాయి. సముద్ర అలలతో పెద్ద శబ్దాలు వినిపించే హంసలదీవి బీచ్ లో నిశ్శబ్దం ఆవహించింది. అలల చప్పుడు లేదు. పాలకాయ థిప్పబీచ్ కు వచ్చే అలలు 100 మీటర్లు వెనక్కి వెళ్లాయి. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి. దీంతో బయటపడ్డ ఇసుకతో బీచ్ నిండిపోయింది. కెరటాలకు బదులుగా అక్కడ ఇసుక ప్రత్యక్షం కావడం చూపరులను ఆకర్షించింది. బీచ్ మరింత అందాన్ని సంతరించుకుంది. అయితే, ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం ఏ విపత్తుకు సంకేతమోనని స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎపిలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. వరద నీరు భారీగా సముద్రంలో చేరింది. అయితే బీచ్ వద్ద ఎటువంటి సముద్ర కెరటాలు, గాలులు లేకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.