Home తెలంగాణ దివ్వెల మాధురి దువ్వాడ ఇంటికి..! వైసీపీ లీడర్ల ప్రేమకథ కంచికి..!? | duvvada love story...

దివ్వెల మాధురి దువ్వాడ ఇంటికి..! వైసీపీ లీడర్ల ప్రేమకథ కంచికి..!? | duvvada love story updates| duvvada srinivas

0

posted on Sep 10, 2024 8:28PM

ఒకపక్క ఆ పుణ్యపురుషుడు దువ్వాడ శ్రీనివాస్… మరోపక్క దగాపడ్డ వీరనారీ దువ్వాడ వాణి… వీళ్ళిద్దరి మధ్య మహిళా శిరోమణి దివ్వెల మాధురి… ఈ వైసీపీ లీడర్ల డైలీ సీరియల్ కథ ఇప్పటికైనా కంచికి చేరినట్టేనా? ఇంకా మిగిలే వుందా? దువ్వాడ శ్రీనివాస్ వుంటున్న ఇల్లు మాకు ఇవ్వాల్సిందే అంటూ ఒకవైపు దువ్వాడ వాణి.. నా అడల్ట్రీ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఇల్లు ఆల్రెడీ దువ్వాడ వాణికి ఇచ్చేశాడు.. ఈ చిన్నిల్లు  మాత్రం నా సొంతం అంటూ దివ్వెల మాధురి ఇంతకాలం రోడ్డు మీద పడ్డారు. ఒకరినొకరు తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టుపొట్టు తిట్టుకున్నారు. వీళ్ళ తిట్లు వినే అదృష్టం మాత్రమే  తెలుగువాళ్ళకి దక్కిందిగానీ, ఈ వీర నారిమణులిద్దరూ ఒకరికొకరు ఎదురై జుట్టూ జుట్టూ పట్టుకుని… డిష్యూం.. డిష్యూం అని తన్నుకునే సీన్ చూసే అదృష్టం మాత్రం కలగలేదు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా వుంటే,  వీళ్ళిద్దరి మధ్యలో ఆయనకిద్దరు తరహాలో ఆడకత్తెర మధ్య పోకచెక్కలా నలిగిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఆయన కూడా మధ్యమధ్యలో మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడు… కష్టాలు చెప్పుకున్నాడు.  లబోదిబోమన్నాడు. ఈయన ఒకవైపు లబోదిబో అంటుంటే, మరోవైపు దువ్వాడ వాణి కూడా మీడియా ముందుకు వచ్చి కారాలూ మిరియాలూ నూరింది. వీళ్ళిద్దరి సీరియస్ మేటర్స్ మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా దివ్వెల మాధురి డాన్సింగ్ రీల్స్, యాక్సిడెంట్ డ్రామాస్, లీకేజ్ ఫోన్ కాల్స్.తో ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఇన్ని రకాలుగా ఈ ముగ్గురూ చాలా రోజుల నుంచి తెలుగు ప్రజల బుర్రలు హీటెక్కించేశారు. వీళ్ళ డైలీ సీరియల్ చూస్తున్న ఆడ లేడీసు ఇళ్ళలో టీవీ సీరియల్స్ చూడ్డం మానేశారు. డైలీ సీరియల్స్.కి మించిన ఎమోషన్స్.తో ట్విస్టులతో, ఎఫెక్టులతో సాగిన దువ్వాడ వారి దువ్వెన గారి బాగోతం వ్యవహారం చూస్తూ బుర్రలు ఖరాబు చేసుకున్నారు. మొత్తానికి దివ్వెల మాధురి మాస్టర్ ప్లాన్ వేసి దువ్వాడ శ్రీనివాస్  ఇంటిని పాత బాకీ కింద తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏ ఇల్లూ లేని దువ్వాడ శ్రీనివాస్ ఆ చిన్న ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఇక దువ్వాడ వాణి తన పెద్ద ఇంట్లో వుండటమే తప్ప ఈ చిన్న ఇంటికి వచ్చి హడావిడి చేయడానికి అవకాశం లేదు. ఇంతకాలం ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివా‌స్‌ది కాబట్టి దువ్వాడ వాణి వచ్చి నానా రచ్చా చేసేది. ఇప్పుడు ఆ ఇల్లు చట్టప్రకారం దివ్వెల మాధురిది కాబట్టి ఇక దువ్వాడ వాణికి ఈ ఇంటి దగ్గరకి వచ్చి సీన్ క్రియేట్ చేసే సీన్ లేకుండా పోయింది. అందుచేత ఇకనైనా ఈ ముగ్గురూ రోడ్డుమీద పడి రచ్చ చేయకుండా ఎవరి కొంపలో వాళ్ళు వుంటే వాళ్ళకీ మంచిది.. తెలుగు డైలీ సీరియళ్ళకీ మంచింది. ఇలాంటి రచ్చలు ఎన్ని చేసినా ఆ జగన్ ఏమీ పట్టించుకోడు కాబట్టి వీళ్ళిలా ఇంతకాలం వీరంగం ఆడారు. ఇక ఇంతకుమించి వీరంగం ఆడారంటే వీళ్ళని జనమే తరిమి కొడతారు. ఎలా ఏడుస్తారో ఏమోగానీ, మీమీ కొంపల్లో మీ ఏడుపేదో మీరు ఏడవండి. రోడ్డుకి, మీడియాకి ఎక్కి న్యూసెన్స్ చేయకండి. ఏంటీ… అర్థమవుతోందా?

Exit mobile version