Insurance Claims : ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఎంతో మంది తమ వాహనాలు, ఇండ్లు, షాపులు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటికి సంబంధించి బీమా క్లెయిమ్ లను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమా క్లెయిమ్ నమోదుకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్, ఈ-మెయిల్, వెబ్ సైట్ ద్వారా బీమా కంపెనీలను నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచించింది.