Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగులో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఆదివారం(నేడు) తేలనుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం బేబక్క, శేఖర్ బాషా, విష్ణుప్రియ, నాగమణికంఠతో పాటు పృథ్వీరాజ్, సోనియా నామినేట్ అయ్యారు. వీరిలో శనివారం ఇచ్చిన టాస్క్‌లో సోనియా సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ప్రస్తుతం ఐదుగురు ఎలిమినేషన్స్‌లో ఉన్నారు.