బాసర ఐఐఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ఇంఛార్జ్ వీసీని తొలగించి… రెగ్యూలర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధికారులు క్యాంపస్ లో ఆంక్షలు విధించారు.