Home ఆంధ్రప్రదేశ్ Where Is YCP: వరద సహాయక చర్యల్లో కానరాని వైసీపీ, మళ్లీ బెంగుళూరు వెళ్ళిపోయిన ...

Where Is YCP: వరద సహాయక చర్యల్లో కానరాని వైసీపీ, మళ్లీ బెంగుళూరు వెళ్ళిపోయిన జగన్

0

గత ఆదివారం తెల్లవారుజాము నుంచి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం, సెంట్రల్ నియోజక వర్గాలను వరద ముంచెత్తిన తర్వాత స్థానిక కార్పొరేటర్లు ఎవరు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. గురువారం జగన్ పర్యటించే వరకు ఎక్కడి నాయకులు అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువకులు మాత్రమే బాధితుల్ని ఆదుకోడానికి ప్రయత్నించారు. చాలా ప్రాంతాల్లో నేటికి వరద సాయం పూర్తి స్థాయిలో చేరడం లేదు.ఈ క్రమంలో వైసీపీ క్యాడర్ ఎక్కడా వరద సహాయక చర్యల్లో పాల్గొనక పోవడం, ఆ పార్టీ నాయకులు కూడా చొరవ చూపకపోవడం చర్చలకు దారి తీస్తోంది.

Exit mobile version