అనంతరం నదీస్నాన మొనరించి ఆ నదీజలాన్ని తీర్థంగా తీసుకోవాలి. స్నానానంతరం సూర్యునికి నమస్కరించి నదీజలాన్ని దోసిళ్ళతో తీసుకొని అర్ఘ్యమివ్వాలి. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన పూజాగృహాన్ని, ఇంటిని గోమయంతో శుభ్రం చేసి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గడపలకు పసుపురాసి, కుంకుమ పెట్టి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పూజా అనంతరం “మమ రుతుసంపర్క జనిత దోష పరిహారార్థం అరుంధతీ సహిత కశ్యపాం రుషి ప్రీత్యర్థం రుషిపూజన కరిష్యే” అని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించాలి.