టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంటుంది. అతడు నెమ్మదిగా ఆడిన ప్రతీసారి ఇది సాధారణమైపోయింది. అయితే, ఇప్పుడు దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’లోనూ ఇదే రిపీట్ అయింది. శుభ్‍మన్ గిల్ సారథ్యం వహిస్తున్న ఇండియా-ఏ తరఫున రాహుల్ ఈ టోర్నీలో ఆడుతున్నాడు. అయితే, ఇండియా-బీతో జరిగిన మ్యాచ్‍లో రాహుల్ నెమ్మదిగా పరుగులు చేయడంతో కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.