Home బిజినెస్ BMW electric scooter: భారత్ లోకి బీఎండబ్ల్యూ సీఈ 02 ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్; బుకింగ్స్...

BMW electric scooter: భారత్ లోకి బీఎండబ్ల్యూ సీఈ 02 ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్; బుకింగ్స్ ప్రారంభం

0

బీఎండబ్ల్యూ సీఈ 02 డిజైన్ & ఫీచర్లు

బీఎండబ్ల్యూ సీఈ 02 ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter) తక్కువ బాడీవర్క్, సింగిల్ ఫ్లాట్ సీటు, ఎక్స్ పోజ్డ్ డ్రైవ్ ట్రెయిన్, చుంకీ ఫ్రంట్ ఫోర్క్స్ అండ్ వీల్స్ ను కలిగి ఉంది. దీని విలక్షణమైన రూపం, కాంపాక్ట్ సైజ్ ఇతర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. బీఎండబ్ల్యూ సీఈ 02 లో ఆల్ ఎల్ఈడీ లైటింగ్, రివర్స్ గేర్, కీలెస్ ఆపరేషన్, యూఎస్బీ ఛార్జింగ్, 3.5 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, గోల్డ్ ఫినిష్డ్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో 239 ఎంఎం సింగిల్ డిస్క్, వెనుక భాగంలో 220 ఎంఎం సింగిల్ డిస్క్ ఉన్నాయి. ఈ-మోడల్ 120/80 సెక్షన్ ఫ్రంట్ టైర్, 150/70 సెక్షన్ రియర్ టైర్ తో 14 అంగుళాల చక్రాలతో నడుస్తుంది.

Exit mobile version