బాబర్ అజామ్ కూడా ఇప్పుడు కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 31 పరుగులు మాత్రమే. తొలి టెస్టులో 0, 22 పరుగులు, రెండో టెస్టులో 31, 11 పరుగులు మాత్రమే బాబర్ చేశాడు. దాంతో పాకిస్థాన్ టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న సౌద్ షకీల్‌తో పాటు షాదాబ్ ఖాన్, మహ్మద్ హారిస్, మహ్మద్ రిజ్వాన్‌లో ఒకరిని ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి కెప్టెన్‌గా ఎంపిక చేయాలని హెడ్ కోచ్ చెప్పినట్లు తెలుస్తోంది.