Home తెలంగాణ విశాల్ గున్ని ఇమేజ్ మటాష్..! | vishal gunni gain bad image| vishal gunni

విశాల్ గున్ని ఇమేజ్ మటాష్..! | vishal gunni gain bad image| vishal gunni

0

posted on Aug 31, 2024 2:03PM

కర్నాటకకు చెందిన విశాల్ గున్ని కష్టపడి చదువుకుని ఐపీఎస్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి ఎంపికయ్యాడు. తన బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి విశాల్ గున్నికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి ఇమేజ్ ఏర్పడింది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా వుండే విశాల్ గున్నిని సోషల్ మీడియా సొంతం చేసుకుంది. విశాల్ గున్ని ఎప్పుడు రోడ్డుమీద కనిపించినా, ఆయన్ని వీడియో తీసేసి సోషల్ మీడియాలో అదిరిపోయే మ్యూజిక్‌తో పోస్టు చేసే అభిమానులు బాగా పెరిగిపోయారు. విశాల్ గున్ని కనిపించిన వీడియోలకు భారీ స్థాయిలో వ్యూస్ వుండేవి. ‘‘సిన్సియర్ పోలీస్ ఆఫీసర్’’, ‘సెల్యూట్ విశాల్ గున్ని సర్’’, ‘‘రియల్ హీరో విశాల్ గున్ని’’ లాంటి కామెంట్లు సదరు వీడియోలకు వుండేవి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో హీరో ఇమేజ్ అనుభవిస్తున్న విశాల్ గున్ని తన ఇమేజ్‌కి భిన్నమైన విలన్ పనులు చేయడం మొదలుపెట్టాడు. జగన్ ప్రభుత్వం అండతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస రాజ్యాన్ని సృష్టించిన పోలీసు అధికారుల జాబితాలో విశాల్ గున్ని పేరు కూడా చేరింది. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాల్ గున్నికి ప్రభుత్వ ఏ బాధ్యతనూ అప్పగించకుండా వెయిటింగ్‌లో వుంచింది. వెయిటింగ్‌లో వుంచాం కదా అని ఇంట్లో కూర్చుంటే కుదరదు, రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి ఆఫీస్ టైమింగ్స్ అయిపోయే వరకు ఆఫీసులోనే వుండాలని డీజీపీ ఆర్డర్ వేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా, సంతకం చేయడానికి వెళ్ళకుండా విశాల్ గున్ని ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, హీరోయిన్ కాదంబరి విషయంలో ప్రవర్తించిన తీరు మరో ఎత్తు.

హీరోయిన్ కాదంబరిని తప్పుడు కేసులో ఇరికించడానికి మూడు పోలీసు బుర్రలు చాలా తెలివిగా వ్యవహరించాయి. ఆ తప్పుడు కేసు వ్యవహారంలో విశాల్ గున్ని బుర్ర కూడా ఇన్వాల్వ్ అయింది. హీరోయిన్ కాదంబరిని ఏరకంగా కేసులో ఇరికించారు… ఏరకంగా ఆమె కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారనే విషయం ఒక్కోక్కటి బయటపడుతుంటే, విశాల్ గున్ని ఇంత దుర్మార్గుడా అని అర్థం చేసుకుని జనం నోళ్ళు తెరుస్తున్నారు. ఇంతకాలం విశాల్ గున్నిని హీరోగా భావించినవాళ్ళు ఇతను హీరో కాదు.. విలన్ అనే జ్ఞానోదయాన్ని పొందారు. ఆర్నెల్లు కలసి తిరిగితే వారు వీరు అవుతారన్నట్టుగా జగన్‌తో రాసుకుని పూసుకుని తిరిగిన పాపానికి విశాల్ గున్ని ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. హీరోయిన్ కాదంబరి కేసు వల్ల విశాల్ గున్నిని సర్వీసు నుంచి కూడా తొలగించే అవకాశం వుందని అంటున్నారు. 

Exit mobile version