Home ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు – TTD తీసుకొచ్చిన ఈ కొత్త...

Tirumala Laddu : శ్రీవారి లడ్డూల జారీలో మార్పులు – TTD తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

0

“దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోవలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు 4-6లడ్డూలను తీసుకోవచ్చు.  గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది.  దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది” అని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఈ విషయంలో భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version