దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళా డాక్టర్లు నైట్షిఫ్ట్స్లో తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సర్వే తేల్చిచెప్పింది. శిక్షణతో కూడిన సిబ్బంది సంఖ్యను పెంచడం, సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేయడం, లైటింగ్ సరిగ్గా ఉంచడం, సీపీఏ (కేంద్ర రక్షణ చట్టం) అమలు, అలర్ట్ సిస్టెమ్స్ ఏర్పాట్లు, డ్యూటీ రూమ్లు కనీస అవసరాలు- లాకర్ వంటివి ఏర్పాటు చేసి వైద్యుల భద్రతను పెంపొందించాలని ఐఎంఏ అధ్యయనం పేర్కొంది.