జాగ్రత్తలు తప్పనిసరి..
వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలోకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లారీలను అనుమతించకుంటే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే సమయంలో.. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రిపుల్ డ్రైవింగ్‌కు నో చెప్పాలి. రైడర్, వెనకాల కూర్చున్న వారు ఇద్దరూ హెల్మెట్ ధరించాలి. లేన్ డ్రైవింగ్‌ను పాటించాలి. ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.