పైన ఫోటో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మామూలుగా ఉంగరం మీద, బయటివైపు డిజైన్ ఉంటుంది. కపుల్ జ్యువెలరీ అంటే వారి అక్షరమో, లేదా హృదయాకారమో ఉండేలా ఉంగరాలు చేయించుకుంటాం. ఈ ఉంగరాలు భిన్నం. డిజైన్ ఉంగరం లోపలి వైపు ఉంటుంది. ఇవి ఎదుటి వాళ్ల కోసం కాకుండా మీ భాగస్వామి మీకు అనుక్షణం గుర్తుండేలా మీరు చేయించుకునే నగ అన్నమాట. ఉంగరం లోపలి వైపు హృదయాకారం, లేదా భాగస్వామి పేరు కాస్త ఉబ్బెత్తుగా ఉండేట్లు డిజైన్ చేస్తారు. దాంతో ఆ ఉంగరం మీరు వేలుకు పెట్టుకున్నప్పుడు ఉంగరం అచ్చు కాకుండా, లోపలి ప్రింట్ ఉన్న ఆకారం అచ్చులాగా మీ చర్మం మీద పడుతుంది. భలే ఉంది కదా ఈ ఐడియా.