రాజ్, కావ్య జోడి…
బ్రహ్మముడి సీరియల్లో రాజ్, కావ్య జోడి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కావ్య పాత్రలో దీపికా రంగరాజు, రాజ్‌గా మానస్ నాగులపల్లి నటిస్తున్నారు. హమీదా ఖాతూన్, నైనీషా, కిరణ్ కాంత్, షర్మితా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాళీలో సూపర్ హిట్ అయిన గాత్చోరా సీరియల్ ఆధారంగా బ్రహ్మముడిని రూపొందించారు. కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో ఈ సీరియల్ రీమేక్ అయ్యింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్‌కు గిరిధర్ పంతం దర్శకత్వం వహించారు.