Home తెలంగాణ పోలీసులా.. నాలుగో కుందేళ్ళా? | ap police irresponsibility

పోలీసులా.. నాలుగో కుందేళ్ళా? | ap police irresponsibility

0

posted on Aug 29, 2024 2:25PM

‘ఈ టోపీ  మీద కనిపించే మూడు సింహాలూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్’ అని ఆవేశంగా మాట్లాడే సీను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కనిపించడం లేదు. ఆ కనిపించని నాలుగోది సింహం కాదు.. కుందేలు అన్నట్టుగా తయారయ్యారు. ఐదేళ్ళపాటు అధికారపార్టీ నాయకులకు, వారి అనుచరులకు, కుటుంబ సభ్యులకు సెల్యూట్లు చేయడం అలవాటు అయిపోయిన ప్రాణాలు కదా మరి. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వారి సేవలో తరించడానికే ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నామధ్య రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె పోలీసులను నిలదీస్తూ మాట్లాడిన విధానం వార్తల్లోకి వచ్చింది. ఎలాంటి అధికార హోదా లోకపోయినప్పటికీ ఆమె దర్పంగా మాట్లాడుతున్నా పోలీసులు ఎదురు మాట్లాడలేని పరిస్థితిలో వున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరికీ విధేయులుగా వుండాల్సిన అవసరం లేదని అన్నారు. అయినప్పటికీ, అలవాటుపడ్డ ప్రాణాలు మారడం లేదు. 

ఈమధ్య చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలలో స్థానిక పోలీసులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడమ్ గారితో ఫొటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేగారి సతీమణికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ పోలీసులు అక్కడకు వెళ్ళడం మీద జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. దాంతో చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బానాయుడు, రమేష్, ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version