పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ముసాఖైల్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులను బస్సు నుంచి దింపి వారి గుర్తింపును పరిశీలించిన తర్వాత కాల్చి చంపారు. ముసాఖేల్‌లోని రరాషమ్ జిల్లాలో అంతర్-ప్రాంతీయ రహదారిని ఉగ్రవాదులు మోహరించి ఈ దారుణానికి ఒడికట్టారు.