ఒక్కో షేరుకు రూ.1,601 ఇష్యూ ధరతో 6.25 మిలియన్ ఈక్విటీ షేర్లను క్యూఐపీకి కేటాయించినట్లు జెన్ టెక్నాలజీస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. జెన్ టెక్నాలజీస్ క్యూఐపీని 2024 ఆగస్టు 21న ప్రారంభించి 2024 ఆగస్టు 23న మూసివేసింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల మధ్య పోటీ నెలకొనడంతో ఇష్యూ దాదాపు 5 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. కోటాక్ మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ ఆఫ్షోర్ ఫండ్, వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ క్యూఐపీలో పాల్గొన్న ప్రధాన ఇన్వెస్టర్లు.