కన్నీళ్లు పెట్టుకున్న దీప
ముందు రానని వారిస్తుంది అనసూయ. కానీ, దీప మాత్రం తను వచ్చేవరకు అక్కడే ఉంటానని, ఏం చెప్పాలనుకుంటున్నావో ఇంటికి వచ్చి చెప్పు. నాకు తండ్రి లేడు. నా మంచి కోరుకునే మనిషి నాతో ఉండాలని కోరుకుంటున్నాను. నాకోసం నీ కొడుకును కాదన్నావ్. నీకంటే మంచి మనిషి ఎవరున్నారు. పనే కావాలంటే చేయడానికి నా దగ్గర పని ఉంది అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో కరిగి పని పూర్తయ్యకా వస్తానని చెబుతుంది అనసూయ. దీప వెళ్లిపోతుంది.