తాడిపత్రి నియోజకవర్గంలో తన వాళ్లే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసిన ఇసుక దందాలో ఉన్న తన వాళ్లు 25 మంది ఆ పని మానుకోవాలని సూచించారు. అంతా తనకి కావాల్సిన వాళ్లేనని చెప్పారు. ఆ ఇసుక దందా చేసే వాళ్లకి వేరే పని చూయిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.