2019 అక్టోబర్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా జై షా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఐసీసీలో కూడా చక్రం తిప్పుతున్నారు. బీసీసీఐ ఆధిపత్యాన్ని మరింత పెంచారు. 2021 జనవరి నుంచి ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్‍గానూ జై షా ఉన్నారు. ఐసీసీ అధ్యక్షుడి బాధ్యతలను డిసెంబర్ 1న చేపట్టాక బీసీసీఐ, ఏసీసీ పదవులను ఆయన వీడనున్నారు.