Wednesday, October 30, 2024

IPO news: పట్టుమని 10 మంది ఉద్యోగులు లేరు; కానీ ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు; ఎందుకలా?

సేల్స్ అంతంత మాత్రమే..

ద్వారకా సెక్టార్ 3లోని రాజపురి రోడ్డులో ఉన్న బ్లూ స్క్వేర్ షోరూమ్ అని పిలువబడే ప్రధాన సాహ్ని ఆటోమొబైల్ షోరూమ్ లో మంగళవారం మధ్యాహ్నానికి కూడా పెద్దగా సందడి కనిపించలేదు. షోరూమ్ లో యమహా ఆర్ 15ఎమ్ నుండి యమహా ఫాసినో వరకు 15 మోడల్స్ ఉన్నాయి. అయితే ఇటీవల లాంచ్ చేసిన ఫ్లాగ్ షిప్ మోటార్ సైకిళ్లు ఆర్ 3, ఎంటీ-03 మోడల్స్ ఇక్కడ లేవు. బేస్ మెంట్ లో ఉన్న గోదాములో మరికొన్ని ద్విచక్ర వాహనాలు ఉండగా, వర్క్ షాప్ ప్రధాన షోరూమ్ కు కొన్ని మీటర్ల దూరంలో ఉంది. కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న మహావీర్ ఎన్ క్లేవ్ లోని మరో సాహ్నీ ఆటోమొబైల్ డీలర్ షిప్ ను కూడా చూడాలని టీమ్ హెచ్ టి ఆటో నిర్ణయించింది. ఇక్కడ కూడా పెద్దగా కస్టమర్ల సందడి లేదు. సంస్థ ఐపీఓ గురించి స్టాఫ్ ను, స్టోర్ మేనేజర్ ను అడిగాం. వారు తమకేం తెలియదని సమాధానమిచ్చారు. మహావీర్ ఎన్ క్లేవ్ షోరూమ్ మరీ దారుణంగా ఉంది. కూలిపోయిన గోడలు, దాదాపు చిరిగిపోయిన ‘యమహా’ పోస్టర్లు కనిపించాయి. కేవలం నలుగురు ఉద్యోగులు మాత్రమే కనిపించారు. సాహ్ని ఆటోమొబైల్స్ పరిధిలోని రెండు యమహా షోరూమ్ లలో ఇది కొత్తదని, గత ఏడాది ప్రారంభమైందని ఇక్కడి స్టోర్ మేనేజర్ చెప్పడంతో, టీం హెచ్ టీ ఆటో ఆశ్చర్యపోయింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana