ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా గండేపల్లికి చెందిన కృష్ణ ప్రవీణ్ కుమార్‌తో.. బోరబండకు చెందిన షమిత (29) వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 20న జరిగింది. వివాహం సమయంలో పెద్దలు నిర్ణయించిన మేరకు రూ.2.50 లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కానీ.. అవి సరిపోలేదని.. పెళ్లైన నెల రోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్త, తోటి కోడలు వేధింపులు స్టార్ట్ చేశారు.