Monday, October 28, 2024

లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్-కుమ్మక్కు రాజకీయాలు, ఉమ్మడి విజయమంటూ బీజేపీ, కాంగ్రెస్ సెటైర్లు-supreme court grants bail to brs mlc kavitha in delhi liquor case bjp congress satires ,తెలంగాణ న్యూస్

కాంగ్రెస్ విమర్శలు

కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..కవితకు బెయిల్ ఊహించిందే అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని ఆరోపించారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ఇరువురూ చూశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై బీజేపీకి, బీఆర్ఎస్ దాసోహం అయ్యిందని విమర్శించారు. హరీశ్ రావు, కేటీఆర్ లు దిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందన్నారు. ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని విమర్శలు చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana