Home లైఫ్ స్టైల్ జుట్టు చివర్లు కట్ చేస్తే వేగంగా పెరుగుతుందా?-know it it really good to trim...

జుట్టు చివర్లు కట్ చేస్తే వేగంగా పెరుగుతుందా?-know it it really good to trim hair ends for hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

  1. గుడ్లలో ప్రొటీన్ బయోటిన్ ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ప్రొటీన్ తగ్గడం వల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది. గుడ్లలో జింక్, సెలేనియం, ఇతర పోషకాలూ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరం.
  2. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ ,ఫోలేట్లుంటాయి. జుట్టు పెరుగుదలకు విటమిన్ ఏ కూడా అవసరమే. కాబట్టి దీన్ని ఆహారంలో వీలైనంత ఎక్కువగా భాగం చేసుకోవాలి. ఇనుము లోపం కూడా తగ్గిస్తుందిది.
  3. చిలగడదుంపల్లో బీటీ కెరోటీన్ ఉంటుంది. ఇది తీసుకుంటే శరీరం దీన్ని విడగొట్టి విటమిన్ ఏ లాగా మారుస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. ఒక చిన్న సైజు చిలగడదుంపలో రోజూవారీ కావాల్సిన బీటా కెరోటిన్ దాదాపు రెండింతలు అందుతుంది.
  4. కొన్ని గింజల్లో విటమిన్ ఈ, జింక్, సెలేనియం ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువ, కేలరీలు తక్కువుంటాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లుంటాయి. ఇవి రోజుకు చెంచాడు తీసుకున్నా జుట్టు పెరుగుదలకు సాయపడతాయి.

స్టైలింగ్:

జుట్టు అందంగా కనిపించాలని తరచూ వేడి గాలితో బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం మంచిది కాదు. ఇవన్నీ జుట్టు సహజ అందాన్ని పాడుచేస్తాయి. నల్లని, ఆరోగ్య వంతమైన జుట్టుకు మించిన అందం దేంతోనూ రాదు. వేడి గాలి వల్ల జుట్టు బలహీనంగా మారిపోతుంది. సలువుగా తెగిపోతుంది. కుదుళ్లలోనూ బలం తగ్గి క్రమంగా జుట్టు రాలడం ఎక్కువవుతుంది.

Exit mobile version