రంగోలీ మ్యాట్స్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. విభిన్న క్వాలిటీలలో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డూర్ మ్యాట్ లాగా పరిచేయడమే. చూస్తే అచ్చం ముగ్గు లాగే ఉంటాయి. కార్నర్ రంగోలీ మ్యాట్స్ కూడా ఉంటాయిందులో. అంటే మూలల్లో అలంకరణ కోసం పెట్టేలా అదే ఆకారంలో దొరుకుతాయి. వీటి చుట్టూ పూరేకులు కానీ, చిన్న ముగ్గు వరస కానీ వేసి మీ చేత్తో ఒక టచ్ ఇచ్చేయండి. ఇవి మురికి అయితే ఉతికేసి మళ్లీ కొత్తగా వాడుకోవచ్చు. మంచి మంచి డిజైన్లు, రంగుల్లో దొరుకుతాయివి. పండగ రోజు ఇంటి గుమ్మం ముందు, లేదంటే రానున్న వినాయక చవితికి పీట ముందు వేసినా మంచి లుక్ వస్తుంది.