Home తెలంగాణ తెలుగు నటితో మాజీ ముఖ్యమంత్రి రాసలీలలు.. | former cm illegal affair| karnataka former...

తెలుగు నటితో మాజీ ముఖ్యమంత్రి రాసలీలలు.. | former cm illegal affair| karnataka former cm illegal affair

0

posted on Aug 27, 2024 1:09PM

రాజకీయ నాయకులు రాసలీలలు నడిపే విషయంలో నంబర్ వన్ రాష్ట్రం అయిన కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు నందిబెట్ట ప్రాంతంలో వున్న అతిథి గృహంలో పలువురు యువతులతో సరస సల్లాపాలు నిర్వహించారని ప్రముఖ న్యాయవాది జగదీశ్‌ ఆరోపణలు చేశారు.  సదరు మాజీ ముఖ్యమంత్రి తీరుపై సుప్రీంను ఆశ్రయించనున్నామని న్యాయవాది జగదీశ్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తామని తెలిపారు. జగదీశ్ అన్నీ చెప్పారుగానీ, ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు మాత్రం చెప్పడం లేదు. ‘ఆయన’ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇద్దరు మంత్రులతో కలసి నందిబెట్ట ప్రాంతలో వున్న అతిథి గృహానికి వెళ్ళేవారట. అక్కడ పలువురు యువతులతో ముఖ్యమంత్రి అండ్ మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని ఆరోపిస్తున్నారు. సదరు యువతులలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక సినీ నటి కూడా వున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇలాంటి సేవలు చేసిపెట్టడం ద్వారా కొంతమంది దళారులు తమ ఫైళ్ళ మీద సంతకాలు చేయించుకునేవారని లాయర్ జగదీశ్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక 20 మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం.  కొద్ది రోజుల్లో ఆ నాయకులు, అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం వుందంటున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రితో కలసి గెస్ట్ హౌస్‌లో సేవలు అందుకున్న మంత్రులలో ఒకరు ఇప్పుడు కర్నాటకలో ఎంపీగా కూడా వున్నారట. 

Exit mobile version