Home తెలంగాణ తెలంగాణపై డెంగ్యూ పంజా!? | dengue fever shivering telangana| health| emergency| like

తెలంగాణపై డెంగ్యూ పంజా!? | dengue fever shivering telangana| health| emergency| like

0

posted on Aug 27, 2024 9:43AM

తెలంగాణ రాష్ట్రం విషజ్వరాల గుప్పెట్లో చిక్కుకుందా? డెంగ్యూ విజృంభిస్తోందా? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలౌతున్న వారి సంఖ్య చూస్తుంటే అవుననే అనాల్సి వస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ వేడలో ప్రభుత్వం జర్వాల నియంత్రణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వేలాది మంది విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలౌతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖపై ఇప్పటి వరకూ కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంటిలోనూ ఒక జ్వర బాధితుడు ఉన్నాడంటే అతిశయోక్తి లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం, ప్రతిపక్షం హైడ్రా సవాళ్లు, ప్రతి సవాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజారోగ్యానికి ఇవ్వడం లేదు.  

అధర గణాంకాల మేరకే రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగాయి. ప్రభుత్వాసుపత్రులలో తీవ్ర మైన మందుల కొరత నెలకొంది. రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో జ్వరాల వ్యాప్తి తీవ్రత చూస్తుంటే జ్వరపీడితుడు కానీ వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ లు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలనీ, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించి, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.  

Exit mobile version