రిమ్స్‌కు బంధువులు..
శ్రీకాకుళం రిమ్స్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. సాయి కిరణ్ స్నేహితులు కూడా రిమ్స్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. భర్త, కుమారుడు మృతితో రామకృష్ణ భార్య రత్న కుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. తనతో మాట్లాడి వెళ్లిన కాసేపటికే తండ్రి, తమ్ముడు మృతిచెందారన్న వార్త విన్న సాత్విక.. దుఖం చూసి అక్కడనున్నవారు కంటతడి పెట్టారు.