దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనీ అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు.