జమ్మూ కశ్మీర్లో చివరిసారిగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు సాధించగా, బీజేపీ 25, ఎన్సీ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచింది. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికలను అధ్యయనం చేస్తే ఎన్సీకి 36, బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 7, పీడీపీకి 5 సెగ్మంట్లలో స్థానాల్లో ఆధిక్యత వచ్చింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే జమ్మూ కశ్మీర్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాల్సిన ఆవశ్యకత తెలుస్తుంది. ఈ పరిణామాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీలుగా మారుతున్నాయి.