posted on Aug 26, 2024 4:13PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
రాఖీ పండగనాడు కవిత జైల్లో ఉండటాన్ని అభిమానులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారు. అన్న కెటీఆర్ ఈ రాత్రి తన పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లనున్నారు.