సమగ్ర నివేదికలో ఎఫ్ఐఆర్ పరిస్థితి, గాయపడిన వారి ఆరోగ్యం, వైద్య చికిత్స, నష్ట పరిహారం పంపిణీ, గాయపడిన వారితో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఏదైనా ఇతర ఉపశమనం, పునరావాసంపై వివరాలు సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది.