పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే?
ప్రతి మహిళకు ఋతుస్రావం దాదాపు 21 నుంచి 35 రోజుల్లో వస్తుంది. అంటే కొంతమంది మహిళలకు పీరియడ్స్ వచ్చిన 21 రోజులకే మళ్లీ పీరియడ్స్ రావచ్చు. లేదా కొంతమందికి 35 రోజులు తర్వాత రావచ్చు. ఇది సాధారణ రుతుచక్రం పరిధి. అయితే కొంతమందిలో పీరియడ్స్ పరిధి పెరిగిపోవచ్చు. ఈ నెల పీరియడ్స్ వచ్చాక 35 రోజులు దాటుతున్నా కూడా మళ్లీ పీరియడ్స్ రాలేదంటే… దాన్ని మిస్డ్ పీరియడ్స్ గా పిలుస్తారు. గర్భం ధరించడం, హార్మోన్ల అసమతుల్యత, అధికంగా బరువు పెరగడం, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఇలా పీరియడ్స్ సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. పీరియడ్స్ రాకపోవడంతో పాటు వికారంగా అనిపించడం, వక్షోజాలు సున్నితంగా మారడం, తీవ్రమైన అలసట, మానసిక స్థితిలో మార్పులు రావడం కూడా కనిపిస్తూ ఉంటాయి.