మీ బరువు ఎత్తుకు తగ్గట్టు ఉండాలి. బీఎమ్ఐ ఎక్కువగా ఉంటే… అంటే ఎత్తుకు అవసరమైన బరువు కన్నా, ఎక్కువ బరువు ఉంటే మీలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, గురక, స్లీప్ అప్నియా, కీళ్ల వ్యాధులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిన అవసరం ఉంది. అధిక బరువు ఉంటే వ్యాయామం, ఆహారపు అలవాట్లు, నడక ద్వారా తగ్గించుకోండి.