Saturday, October 26, 2024

UGC Fake Universities List : ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా 21 – యూజీసీ ప్రకటన

UGC Fake Universities List : దేశ వ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. ఈ వర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపింది. వీటిని డిగ్రీలు ప్రదానం చేసే అధికారంలేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసినా వాటిని విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించమని స్పష్టం చేసింది. నకిలీ వర్సిటీల్లో దిల్లీల్లో అత్యధికంగా 8 ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ లో రెండు ఉన్నాయి. కర్ణాటక,పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ వర్సిటీలు ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana